కొత్తపేటలోని భగత్ సింగ్ బొమ్మ సెంటర్ లో ఆదివారం అఖిల భారత యువజన సమాఖ్య అర్ధ నగ్న ప్రదర్శన చేపట్టింది. ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఐయఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వలీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలకు అనుగుణంగా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.