వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్‌ను గురువారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ విద్యార్థులు సందర్శించారు. వారికి డ్రోన్ టెక్నాలజీపై సమగ్ర అవగాహన కల్పించారు. డ్రోన్ టెక్నాలజీ, పంటల పిచికారీ, ఆపరేట్ చేసే విధానం తదితర అంశాలను డ్రోన్ పైలెట్ గోపీనాథ్ విద్యార్థలకు వివరించారు. కార్యక్రమంలో పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ కళాశాల సిబ్బంది ఉన్నారు.