పిడుగురాళ్ల: తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగింత

75చూసినవారు
పిడుగురాళ్ల: తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగింత
తప్పిపోయిన ఆరేళ్ళ బాలుడిని బుధవారం పిడుగురాళ్లలో తల్లిదండ్రులకు అప్పగించారు. పట్టణంలోని రైల్వే స్టేషన్లో బాలుడు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గమనించిన అజ్ఞాత వ్యక్తి, అతన్ని స్థానిక పోలీసులకు అప్పగించాడు. పోలీసులు బాలుడి వివరాలను సేకరించి, పిడుగురాళ్ల రజక కాలనీకి చెందిన మహేష్, మాధవి ను తల్లిదండ్రులుగా గుర్తించారు. బాలుడిని వారికి అప్పగించారు.

సంబంధిత పోస్ట్