కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించిన ఆర్డీఓ

50చూసినవారు
కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించిన ఆర్డీఓ
మాచవరం మండలం రేగులగడ్డ కృష్ణా నది పరివాహ ప్రాంతాన్ని బుధవారం గురజాల ఆర్డీఓ రమాకాంత్ రెడ్డి పరిశీలించారు. నాగార్జునసాగర్ నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారికి సూచించారు. జాలర్లు ఎవరు చేపల వేటకు వెళ్ల వద్దని పడవ ప్రయాణాలు కూడా నిలిపివేయాలని ఆర్డీఓ ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీఓ అశోక్, ఆరి కోటేశ్వరరావు, వీఆర్ఓ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్