78వ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా గురువారం ఒంగోలులో కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హనుమంతునిపాడు మండల డిప్యూటీ తహశీల్దార్ కిషోర్ ఉత్తమ అధికారిగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా కిషోర్ ను పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు.