చంద్రశేఖరపురం మండలం భైరవకోన భైరవేశ్వరస్వామి వారి దేవస్థానములో షాపుల లీజుకు బహిరంగ వేలం పాటలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఈవో నర్రా నారాయణరెడ్డి మంగళవారం తెలిపారు. ఆగస్టు 3 నుంచి 2025 మే 31 వరకు లీజు హక్కులకు బహిరంగ వేలం ఆగస్టు 2న ఆలయ ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. వేలం పాటలో పాల్గొనదలచిన వారు రూ. 500లు చెల్లించి వేలం పాటలకు సంబంధించిన ఫారమ్స్ పొందాలని ఈవో సూచించారు.