మాచర్ల మండల పరిధిలోని పశువేముల గ్రామంలో సోమవారం రాత్రి ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇందులో ఒకరిపై ఒకరు గొడ్డలితో దాడి చేసుకున్నారు. గాయపడిన బెజవాడ రమేశ్, మంగమ్మలను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు తరలించారు. రూరల్ సీఐ నఫీజ్ బాషా కుటుంబ సభ్యుల నుంచి సమాచారం సేకరించి కేసు నమోదు చేశారు. గొడవలకు గల కారణాలు తెలియాల్సి ఉంది.