ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వాలని, ఒకరు ఇస్తే వచ్చేది కాదంటూ మాజీ ముఖ్య మంత్రి జగన్ పై ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి నిప్పులు చెరిగారు. రెంటచింతలలోని టీడీపీ సీనియర్ నేత గొంటు ఆదిరెడ్డి స్వగృహంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో ప్రశ్నిస్తే సంకెళ్లు, ఎదురు తిరిగితే జైళ్లు, ప్రజావ్యతిరేక నిర్ణయాలతో ప్రజాస్వామ్య వ్యవస్థకు పాతరేశారని విమర్శించారు.