పల్నాడు జిల్లా వైద్య ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం దుర్గి పిహెచ్ఎస్ ఆధ్వర్యంలో మండలంలోని మల్లికార్జున చెంచుగూడెం గజాపురం తండాల్లో దుర్గి పిహెచ్సి వైద్యులు పెద్ద సైదులు సిబ్బందితో వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాల్లో గజాపురంలో 32 మందికి మల్లికార్జున చెంచుగూడెంలో 21 మందికి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా వైద్యులు సైదులు మాట్లాడారు.