విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని ఇన్-ఛార్జ్ తహశీల్దార్ పుల్లారావు అన్నారు. తనిఖీల్లో భాగంగా కారంపూడి పట్టణంలోని స్థానిక బీసీ హాస్టళ్లను, బాలుర, బాలికల ఆశ్రమ పాఠశాలను శుక్రవారం పుల్లారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని అన్నారు. విద్యార్థులు బాగా చదివి, ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.