రెంటచింతల మండల కేంద్రంలో బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ఈద్గాలో సామూహిక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మత పెద్దలు మహమ్మద్ ప్రవక్త సందేశాన్ని ముస్లిం సోదరులకు అందించారు. ప్రతి ఒక్కరు తోటి వారిపట్ల ప్రేమా కరుణలు కలిగి ఉండాలన్నారు. సేవాభావాన్ని అలవర్చుకోవాలని సూచించారు.