పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలపాడు గ్రామంలో గురువారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర నాగేంద్ర స్వామి తిరుణాల ఘనంగా జరగుతోంది. ఈరోజు ఉదయం నుండి స్వామి వారికి ప్రత్యేక పూజలు, మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించగా.. స్వామి వారి ఊరేగింపు గ్రామంలో నిర్వహించారు. ఈ వేడుకలకు స్వామి వారి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.