రెంటచింతల: ట్రాన్స్ ఫార్మర్ లో రాగి తీగల చోరి

80చూసినవారు
రెంటచింతల: ట్రాన్స్ ఫార్మర్ లో రాగి తీగల చోరి
రెంటచింతలలో ఆర్అండ్ బీ రహదారి పక్కన పొలాలకు ఏర్పాటు చేసిన ట్రాన్స్ ఫార్మర్ లో రాగి తీగలు చోరీకి గురైనట్లు బాధిత రైతు టి. రాయపురెడ్డి పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. సుమారు రూ. 30 వేలు నష్టం సంభవించిందన్నారు. మిర్చి పంట అదునులో ఉన్న సమయంలో తీగలు చోరీకి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి బాధిత రైతు నుంచి వివరాలు సేకరించారు.

సంబంధిత పోస్ట్