వినుకొండ పట్టణంలో వైసీపీ నిరసన ర్యాలీ నిర్వహించింది. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు విద్యుత్ చార్జీల పెంపుదలకు నిరసనగా.. శుక్రవారం వైసీపీ కార్యాలయం నుంచి కరెంట్ ఆఫీస్ వరకు మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అభిమానులు పాల్గొన్నారు.