మాచర్ల: తమ సమస్యలను పరిష్కరించాలని తహసిల్దార్ కు వినతి
మాచర్ల తహసిల్దార్ వాణికి, ఎంపీడీఓకి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 104 ఉద్యోగులు గురువారం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ వైస్ ప్రెసిడెంట్ సుభాని మాట్లాడుతూ మూడు నెలలుగా జీతాలు లేక 104 ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అదేవిధంగా ఉద్యోగులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో 104 డిఇఓ లు షేక్ ఏడుకొండలు, శీలం బాలకిరణ్ పాల్గొన్నారు.