మాచర్ల: నాగార్జునకొండను సందర్శించిన పర్యాటకులు
ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండను పలువురు పర్యాటకులు ఆదివారం భారీగా సందర్శించారు. ఈ సందర్భంగా వారు విజయపురిసౌత్లోని లాంచీ స్టేషన్ చేరుకొని, పర్యాటకశాఖ ఏర్పాటు చేసిన లాంచీలలో కొండకు చేరుకున్నారు. కొండలో నెలకొల్పిన బుద్ధుని కాలంనాటి అవశేషాలను, బుద్ధుని విగ్రహం, మ్యూజియం, యజ్ఞశాలలను ఎంతో ఆసక్తిగా తిలకించారు. ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నాగార్జునకొండను సందర్శించడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు.