పల్నాడు: దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: ఎస్పీ
కారంపూడి మండలం కాంచవరంలో చిలకల వెంగల్ రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని సోమవారం ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ఎస్పీ వీడియో విడుదల చేశారు. ఇటువంటి అంశాలపై దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. గ్యార్మీ వేడుకల విషయంలో మరోకరితో వెంగల్ రెడ్డి గొడవ పడ్డారని గుర్తు చేశారు.