మంగళగిరిలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

56చూసినవారు
మంగళగిరిలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
కానిస్టేబుల్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళగిరిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు 2018 బ్యాచ్ కు చెందిన కళ్యాణి (34) తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో సోమవారం మంగళగిరిలోని తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సిఉంది.

సంబంధిత పోస్ట్