మంగళగిరి పరిధి గణపతి నగరంలోని చల్లపల్లి నాగేంద్రం అనే వ్యక్తి అద్దెకి నివసిస్తూ విజయవాడలో బంగారం పని చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిరోజు మాదిరిగా గురువారం పనికి వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో ఇంటిలోని ఏసీ గ్యాస్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇంట్లోని వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ. 18 లక్షలు నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. పోలీసులు విచారణ చేపట్టారు.