పెంచిన టోల్ ఫీజులను వెంటనే రద్దు చేయాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళగిరి రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కాజ టోల్ గేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలపై భారం మోపకుండా వెంటనే టోల్ ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈమని అప్పారావు, మండల కార్యదర్శి యు. దుర్గారావు పాల్గొన్నారు.