మంగళగిరి: మంత్రి లోకేశ్‌పై పోస్ట్.. వైసీపీ ఎమ్మెల్యేకు నోటీసులు

68చూసినవారు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదుతో యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పై మూడు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన మంత్రి నారా లోకేశ్‌పై ఎక్స్‌లో అనుచిత పోస్టు పెట్టారు. దాంతో అతనిపై మరో కేసు నమోదైంది. పోలీసులు ఆయనకు వాట్సాప్‌లో నోటీసులు పంపారు. కానీ ఎమ్మెల్యే స్పందించకపోవడంతో సోమవారం ఈ 4 కేసులకు సంబంధించి నోటీసులను పోలీసులు అతని ఇంటికి వెళ్లి అందజేశారు.

సంబంధిత పోస్ట్