మంగళగిరి రూరల్ స్టేషన్ కి నూతన ఎస్ఐ నియామకం

71చూసినవారు
మంగళగిరి రూరల్ స్టేషన్ కి నూతన ఎస్ఐ నియామకం
మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ రెండవ ఎస్ఐ గా బి. మధుసూదనరావు నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఆయన స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ కిషోర్ నరసరావుపేటకు బదిలీకాగా ఆయన స్థానంలో మధుసూదనరావు ఛార్జ్ తీసుకున్నారు. ఈసందర్భంగా ఎస్ఐ కు స్టేషన్ సిబ్బంది ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్