ప్రజా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడవద్దని మంత్రి నారా లోకేశ్ ప్రజలకు భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న వారు బుధవారం ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బారు తరలివచ్చారు. మంత్రిని స్వయంగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించిన మంత్రి పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు.