అమాయక పిల్లలకు గంజాయిని అలవాటు చేసి దొంగతనాలు చేయిస్తున్న గ్యాంగ్ పై బాధితులు పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. ముఠా వేధింపులకు గురైన జమీర్ మీరావలి తన తల్లిదండ్రులతో కలిసి ముఠా సభ్యులు ఫారుక్, షారుక్లపై నరసరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీలు చేయకపోతే చంపేస్తామని బెదిరించారన్నారు. తమకు గంజాయి మత్తు ఇచ్చి 150కి పైగా చోరీలు చేయించారని బాధితుడు మీరావలి తెలిపారు.