పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం అచ్చమ్మపాలెం గ్రామం వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. వినుకొండ నుంచి విజయవాడ వెళ్తున్న కారును అచ్చమ్మపాలెం వద్ద కోటప్పకొండ నుంచి వస్తున్న మరో కారు అతివేగంతో ఎదురుగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.