పర్చూరు మండల పరిధిలోని అన్నంబొట్ల వారి పాలెం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టిప్పర్ వాహనం బైక్‌ను ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందగా. మరొకరికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.