రైతు ప్రయోజనాలే లక్ష్యంగా సాగునీటి సంఘాల పాలకవర్గాలు పనిచేయాలని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కోరారు. సోమవారం నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన నీటి సంఘాల పాలకవర్గాలతో సమావేశమై వారి విధులు,బాధ్యతలు గురించి దిశా నిర్దేశం చేశారు. వైసీపీ ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనల్లో కాలువలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, దీంతో అవన్నీ పూడుకుపోయాయన్నారు. చిట్టచివరి భూములకు కూడా నీరు అందేలా కొత్త కమిటీలు చేయాలన్నారు.