జీవితాంతం మనకు అన్నం పెట్టే భూమికి ఏ సమస్యలు ఉండరాదని రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆర్ పి సిసోడియ అన్నారు. పర్చూరు మండలం తన్నీరువారిపాలెంలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అడంగులు కావాలని అర్జీలు పెట్టుకున్న వారికి వాటిని సిసోడియ అందజేశారు. అనంతరం ప్రజల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ వెంకట మురళి కూడా పాల్గొన్నారు.