సంక్రాంతి పండుగ సందర్భంగా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెంలో పొట్టేళ్ల పందేలు బుధవారం జోరుగా జరిగాయి. వివిధ గ్రామాల నుంచి వచ్చిన కొమ్ములు తిరిగిన పొటేళ్లు పోటీల్లో పాల్గొని ప్రేక్షకులను ఆకర్షించాయి. పోటీలు తిలకించడానికి వేలాది మంది జనం తరలివచ్చారు. ఎడ్ల పందేల కంటే పొట్టేలు పందేలకు మంచి క్రేజ్ ఉంది అనడానికి ఇదే నిదర్శనం. మొదటి బహుమతిగా రూ. 20 వేలు ఇవ్వనున్నట్లు నిర్వహకులు తెలిపారు.