పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు
పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష పడింది. ఈ కేసులో సరైన సాక్షాదారాలు ప్రవేశపెట్టిన పోలీసులను జిల్లా ఎస్పీ దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు. కొమరోలు మండలం అక్కపల్లి గ్రామానికి చెందిన ప్రశాంత్ అదే గ్రామానికి చెందిన ఓ బాలుడి పట్ల ప్రకృతి విరుద్ధ లైంగిక చర్యలకు పాల్పడటంతో కేసు నమోదయింది. నేరం రుజువు కావడంతో నిందితుడికి న్యాయమూర్తి జీవిత ఖైదుతో పాటు రూ. 50, 000 జరిమానా విధించారు.