పెదకూరపాడు మండలం 75 త్యాళ్ళూరు హైస్కూల్లో గురువారం భూదాత, విద్యాదాత గుత్తికొండ పద్మ వర్థంతిని ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు. గ్రామీణ ప్రాంతంలో విద్యాభివృద్ధి చేయాలనే తపనతో పాఠశాలలో అదనపు గదిని నిర్మించడమే కాక అనేక సంస్థలకు భూదానం చేసిన మహోన్నతమైన వ్యక్తి పద్మ అని వక్తలు కొనియాడారు. హెచ్. ఎం శ్రీనివాస రెడ్డి, చైర్మన్ జి. పున్నారావు, జి. శ్రీనివాస రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.