ఐదేళ్లుగా రైతులకు ఇవ్వాల్సిన వార్షిక కౌలు బకాయిలు ప్రభుత్వం విడుదల చేయడంతో అమరావతి రైతులు స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వాన్ని చంద్రబాబును దేవుడుతో సమానంగా పోల్చారు. రైతులు సమస్యలను పరిష్కరించిన చంద్రబాబుకు కూటమి ప్రభుత్వ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. తుళ్లూరులో అమరావతి రైతులు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.