గ్రామాల ఆర్దిక స్థిరత్వానికి ఈ శిక్షణ తోడ్పడుతుంద పెదకూరపాడు ఎండిఓ రామకృష్ణ అన్నారు. మంగళవారం పెదకూరపాడు మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణకార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ఇచ్చిన శిక్షణ ప్రకారం అమలు జరిగితే అభివృద్ధి సాధించవచ్చునన్నారు. ఆయా శాఖల వారీగా చేయవలసిన పనులు పై వివరించారు. రెవెన్యూ అధికారులు, సర్వేర్లు, పంచాయితీ కార్యదర్శులు, సర్పంచులు, వైద్యశాఖ, మహిళా పోలీసులు పాల్గొన్నారు.