చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేష్, దర్శకుడు అశ్విన్ రామ్, సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్ ’’సినిమాను నిర్మించారు. ఈనెల 19న విడుదల కానుంది.