గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మాచవరం, పెదపాలెం గ్రామాలలో శనివారం పల్లె పండుగ అభివృద్ధి పనులను అధికారులు తనిఖీ చేశారు. పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ జె. నతానియేల్ అధికారులతో కలిసి గ్రామాలలోని అంతర్గత సీసీ రోడ్లు పరిశీలించారు. కార్యక్రమంలో గ్రామీణ అభివృద్ధి శాఖ డీఈఈ శాంతారావు, జి ముత్యం బాబు, పొన్నూరు పంచాయతీరాజ్ డిఈ ఎం. ఎన్. ఎస్ ప్రసాద్, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
.