పొన్నూరు పట్టణం అంబేద్కర్ సెంటర్లో శుక్రవారం సైబర్ నేరాలపై అర్బన్ సీఐ రవి కిరణ్ ఆధ్వర్యంలో పట్టణoలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్మించి ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచించారు. అపరిచిత ఫోన్ కాల్స్ తీయరాదని, కొత్తయాప్ లు డౌన్లోడ్ చేసుకోరాదని సైబర్ నేరగాళ్లు వివిధ పద్ధతులలో నగదు దోపిడీ పై ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.