ప్రత్తిపాడు: ఆలయానికి దారి కావాలని గ్రామస్తుల ఆందోళన

81చూసినవారు
పెదనందిపాడు మండల తహసిల్దార్ కార్యాలయం ఎదురు శుక్రవారం రజక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా మా కుల దేవత వీర్లంకమ్మ గుడికి బాట ఇవ్వవలసిందిగా కమిటీ సభ్యులు గ్రామ సదస్సులో వినతి పత్రం అందజేశామని తెలిపారు. గుడికి రావడానికి దారి లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు స్పందించి దారిని ఏర్పాటు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్