గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం కట్రపాడు గ్రామం ప్రధాన కూడలిలో విద్యుత్తు వైర్లు ప్రమాద భరితంగా మారాయి. విద్యుత్ వైర్లు చేతికందే దగ్గరలో ఉండటం వలన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో నిత్యం ప్రజలు, మూగజీవాలు ఈ రహదారి నుంచి ప్రయాణిస్తూ ఉంటాయి. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి చేతికి అందే విద్యుత్ తీగలను సరిచేసి గ్రామ ప్రజల ప్రాణాలు కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.