డ్వాక్రా మహిళలు తాము తయారు చేసిన ఉత్పత్తులను అమ్ముకునేందుకు ప్రతి మండలంలో నూతన మహిళా మార్టులను ఏర్పాటు చేయనున్నట్లు డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి తెలిపారు. ప్రత్తిపాడు మండల పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ వివోఏ లు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. మహిళలు లక్షాధికారులు కావడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.