Oct 26, 2024, 15:10 IST/కరీంనగర్
కరీంనగర్
కరీంనగర్: సాయిబాబా మృతి ప్రభుత్వ హత్యే
Oct 26, 2024, 15:10 IST
పౌరహక్కుల నేత, ప్రజాస్వామికవాది, మేధావి ప్రొఫెసర్ సాయి బాబా మృతి కేంద్ర ప్రభుత్వ హత్య అని పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహయ కార్యదర్శి మాదన కుమారస్వామి, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి కొమురయ్య ఆరోపించారు. ఆదివారం కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో సాయిబాబా సంస్మరణ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. సంస్మరణ సభ కరపత్రాలు, పోస్టర్లను పెద్దపల్లిలోని అమరవీరుల స్థూపం వద్ద శనివారం ఆవిష్కరించారు.