గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు టిడిపి సభ్యత్వ నమోదు దీపం పథకం కార్యక్రమాలను ప్రారంభించారు. ముందుగా ఎన్టీఆర్, ముఖ్యమంత్రి చిత్రపటాలకు పార్టీ శ్రేణులతో కలిసి పాలాభిషేకం చేశారు. కూటమి పాలనలో స్వర్ణ యుగం మొదలైందని ఈ సందర్భంగా తెలిపారు. సూపర్ సిక్స్ చేసి తీరుతామన్నారు. ఐదు లక్షల బీమాతో పార్టీ సభ్యత్వం కల్పిస్తుందని తెలిపారు.