చెరుకుపల్లి మండలం గుళ్ళపల్లి గ్రామంలో శుక్రవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరిల్లు దగ్ధమైంది. ప్రమాదంలో ఇంటితోపాటు గొడ్లచావిడి, వరిగడ్డి వామి, రెండు గేదలు కాలిపోగా ఒక దూడ మృతి చెందింది. సుమారు నాలుగు లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు పుల్లారెడ్డి తెలిపారు. అగ్నిప్రమాదంలో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.