అఖిల భారత పశు గణన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను రేపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు రెవిన్యూ మంత్రి వర్యులు అనగాని సత్యప్రసాద్ సోదరు లు అనగాని శివప్రసాద్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ద్వారా పశుగణన పథకాల రూపకల్పనకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. 25 అక్టోబర్ 2024 నుంచి 28 ఫిబ్రవరి 2025 వరకు పశుగణన కొనసాగుతుందన్నారు.