పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆదివారం ఓ మహిళ హత్యకు గురైన విషయం తెలిసిందే. కాగా మృతురాలు రమాదేవి(35) కొంతకాలంగా వెంకటరావు అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్న నేపథ్యంలో వెంకటరావు రమాదేవిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.