సత్తెనపల్లిలో నకిలీ పురుగు మందులు స్వాధీనం చేసుకున్నట్లు సోమవారం సత్తెనపల్లి వ్యవసాయ సహాయ సంచాలకుడు శ్రీధర్ రెడ్డి తెలిపారు. వడవల్లి ప్రాంతంలో గూడెం నందు అనధికార పురుగు మందులు నిల్వ ఉంచగా దాడి నిర్వహించామన్నారు. ఈ దాడిలో మొత్తం రూ. 5. 85 లక్షల విలువ గల పురుగుమందులు స్వాధీనం చేసుకున్నామన్నారు. కార్యక్రమంలో వడవల్లి వీఆర్వో అనిల్ పాల్గొన్నారు.