పల్నాడు: వైన్ షాప్ లో కుర్చీ కోసం ఘర్షణ

70చూసినవారు
పల్నాడు జిల్లా ముప్పాళ్ళలోని వైన్ షాప్ లో మందుబాబులు ఘర్షణ పడ్డారు. బుధవారం వైన్ షాప్ లో కుర్చీ కోసం తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది. బీరు సీసాలు, కుర్చీలతో ఇరువురు వర్గాలు పరస్పరం దాడికి పాల్పడ్డాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘర్షణలో ఇద్దరికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్