సంక్రాంతి పండుగ పురస్కరించుకొని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు వివిధ రకాల వాహనాల్లో ప్రయాణం చేస్తుంటారు. చివరి రోజు కనుమ రోజు రామకృష్ణాపురం నుంచి సత్తెనపల్లి వెళ్లే ప్రధాన రహదారి బుధవారం ఉదయం రద్దీగా కనిపించింది. పండుగ వేళలల్లో జాగ్రత్తలు పాటిస్తూ అతివేగాన్ని నియంత్రిస్తూ, ఇంటికి జాగ్రత్తగా చేరాలని వాహనదారులకు పలువురు ప్రజలు, నిపుణులు హెచ్చరించారు.