సత్తెనపల్లి పట్టణంలో 20వ వార్డులోని కూరగాయల మార్కెట్లో రూ. 38. 50 లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు బుధవారం ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ శంకుస్థాపన చేశారు. దక్షిణం, తూర్పు వైపున కాంపౌండ్ వాల్ నిర్మాణం, కూరగాయల మార్కెట్ లో స్టెయిన్ లెస్ స్టీల్ రెయిలింగ్, షీట్ రూఫింగ్ ఏర్పాటు చేయనున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, వార్డు కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.