నిందితులను అరెస్టు చేయాలి

67చూసినవారు
పెదకూరపాడు మండల పరిధిలోని లగడపాడు గ్రామంలో అక్రమ కేసులను నిరసిస్తూ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎస్సీలు రోడ్డుపై శనివారం నిరసన తెలిపారు. గత వారంలో వినాయకుడి విగ్రహం ఊరేగింపు కాలనీ వైపు వచ్చి వివాదాలకు దారి తీసిన వైనంలో దోషులను పోలీసులు అరెస్టు చేయలేదని వాపోయారు. అక్రమంగా 17 మంది ఎస్సీలపై తప్పుడు కేసులు పెట్టడంపై మండిపడ్డారు. నిందితులను అరెస్టు చేయాలంటూ నిరసన తెలిపారు.

సంబంధిత పోస్ట్