ఒక్క ఛాన్స్ అంటూ 20 సంవత్సరాలు వెనక్కి నెట్టారు: ఎమ్మెల్యే

50చూసినవారు
ఒక్క ఛాన్స్ అంటూ 20 సంవత్సరాలు వెనక్కి నెట్టారు: ఎమ్మెల్యే
ఒక్క ఛాన్స్ అంటూ జగన్ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి నెట్టాడంటూ సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. గురువారం సత్తెనపల్లి పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు కూటమి సర్కార్ శ్రీకారం చుట్టిందన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో పల్లెపండుగ వారోత్సవాలతో రాష్ట్రం దూసుకుపోతుందన్నారు. మేనిఫెస్టోని ప్రతి హామీని నెరవేర్చుతామని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్